ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (09:48 IST)

27-12-2018 - గురువారం మీ రాశి ఫలితాలు - మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే...

మేషం: బ్యాంకింగ్ వ్యవహారాలు, దూరప్రయాణాల్లో మెళకువ వహించండి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మీ గౌరమ మర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు. కొన్ని పనులు అసంకల్పితంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల రాకపోక వలన అసౌకర్యానికి లోనౌతారు.
 
వృషభం: ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఊహించని వారి నుండి ఆహ్వానాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. 
 
మిధునం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీల అదుపుతప్పిన ఆవేశం వలన కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి పనిభారం అధికమవుతుంది. 
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రయామీ బలహీనతలు కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్థులకు శుభం కలుగుతుంది.  
 
సింహం: ఉపాధ్యాయులకు తోటివారి సహాయం లభించదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి కలిసివస్తుంది. నిరుద్యోగులకు మంచి సదవకాశం లభిస్తుంది. వేళకాని వేళ భుజించుట వలన ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. కళాకారులు, సినిమా రంగాల్లోవారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. 
 
కన్య: ప్రభుత్వ కార్యాలయాలలో పనులు మందకొడిగా సాగుతాయి. మొండి బాకీలు సైతం వసూలుకాగలువు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల నుండి వేధింపులు వంటివి ఎదుర్కుంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. గృహ నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది.  
 
తుల: రాజీమార్గంతో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఖర్చులు రాబడికి మించడంతో చేబదుళ్ళు, రుణాలు స్వీకరిస్తారు. ప్రేమికుల మధ్య అనుకోని సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరున్న వాస్తవం గ్రహించండి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి.  
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు చికాకు, విద్యార్థులకు సంతృప్తి చేకూరుతుంది. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఏమరపాటు తనంతో ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు. 
 
ధనస్సు: అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి. విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. విరోధులు వేసే పథకాలు తెలివితో త్రిప్పి గొట్టగలుగుతారు. స్త్రీలకు పనిభారం అధికం. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. 
 
మకరం: వృత్తి వ్యాపారార్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. బ్యాంకులు వ్యవహారాలలో ఒత్తిడి, బెట్టింగ్‌లు, వ్యసనాల వల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి చికాకులు తప్పువు. బంధుమిత్రుల నుండి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు.     
 
కుంభం: రాజకీయాల్లో వారికి ఆదరాభిమానాలు అధికమవుతాయి. స్త్రీలు పనివారలను ఓ కంటకనిపెట్టడం మంచిదని గమనించండి. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు.   
 
మీనం: పత్రికా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు లెదురవుతాయి. రుణయత్నాల్లో ప్రతికూలత లెదుర్కుంటారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. స్త్రీలకు వాహనయోగం, వస్త్రప్రాప్తి, వస్తులాభం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు.