కోరుకున్న వరుడి కోసం.. ఈ మంత్రాన్ని 108 సార్లు, 27 రోజులు పఠిస్తే..?
కోరుకున్న వరుడు దొరకాలంటే.. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకోవాలంటే.. ఈ మంత్రాన్ని పఠించాలి.. అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ఇది పార్వతి దేవి యొక్క మంత్రం. భగవతి పార్వతి దేవి ఆశీర్వాదం కోసం.. ఈ మంత్రాన్ని జపించవచ్చు.
ఈ మంత్ర జపంతో శంకరుడిని అనుగ్రహం పొందవచ్చు. ఈ పార్వతి మంత్రాన్ని 108 సార్లు ఏకాగ్రతతో పఠించే కన్యలు.. త్వరలోనే భగవతి దేవి అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే వివాహంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి.
"హే గౌరీ శంకరార్ధాంగి, యధాత్వం శంకరప్రియా
తథామాం, కురు కళ్యాణి, కాంత కాంతం సుదుర్లభమ్'' అనే ఈ మంత్రాన్ని 108 సార్లు, 27 రోజులు పఠించాలి.
కోరుకున్న భర్త కోసం గౌరీ మంత్రాన్ని ఎలా జపించాలి.
ఈ మంత్ర సాధన ఏదైనా పవిత్రమైన రోజు లేదా మంగళవారం ప్రారంభించవచ్చు.
ఉదయం స్నానం చేసిన తరువాత, ఉదయం ఎర్రటి బట్టలు ధరించి, ఎర్రటి పువ్వుతో మా గౌరీని ఆరాధించండి.
ధూపదీపాలను వెలిగించాలి. ఆపై 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. 21 రోజులు ఇలా చేస్తే.. చివరి రోజున మీరు ఏడుగురు అమ్మాయిలకు బహుమతులు ఇవ్వాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.