ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:57 IST)

రోజూ ఉదయం, సాయంత్రం తులసిని పూజిస్తే..?

రోజూ చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి వద్ద నిలబడి ఈ శ్లోకాన్ని పఠింటి నమస్కరించి ఆ నీటిని తులసి మొదట్లో పోయాలి. అనంతరం తులసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

తులసీ దేవి నామములు స్మరిస్తేనే చాలు జీవన్ముక్తి కలుగుతుందని, అశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుందని దేవిభాగవతం ద్వారా తెలుస్తోంది. ఇంకా తులసీని.. 
 
''నమస్తులసి కళ్యాణీ, నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి, నమస్తే మంగళప్రదే
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ'' అని స్తుతిస్తూ..

రోజూ చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి వద్ద నిలబడి ఈ శ్లోకాన్ని పఠింటి నమస్కరించి ఆ నీటిని తులసి మొదట్లో పోయాలి. అనంతరం తులసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి. 
 
తులసికి చేసే ప్రదక్షిణము అశుభాలను తొలగిస్తుంది. మనోభీష్టాలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం.

ఉదయం, సాయంత్రము తులసి వద్ద చేసే దీపారాధన సౌభాగ్యాన్ని ఇవ్వటమే గాక ఇంటిలోకి దుష్టశక్తులు రాకుండా చేస్తుంది. తులసి మొక్క క్షీర సాగరమధనంలో కామధేనువు, కల్పతరువులు, అమృతంతో బాటు ఉద్భవించిందని పద్మ పురాణంలో ఉంది.