శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి 1296 రకాల ఆభరణాలను ఇలా చూడొచ్చు..?
కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి సమర్పించే ఆభరణాలను వీక్షించేందుకు వేయి కనులైనా చాలవు. అలంకరణ ప్రియుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తుంటారు. అంతేగాకుండా భారీ కానుకలను సమర్పించుకుంటూ వుంటారు.
అలా భారీ కానుకల్లో బంగారు, వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలు వున్నాయి. అయితే శ్రీవారి ఆభరణాలను భక్తులకు అలంకరణ సందర్భంగా చూపిస్తుంటారు. కానీ ఇక భక్తుల స్వామి వారి ఆభరణాలను ప్రదర్శన ద్వారా భక్తులకు చూపెట్టనున్నారు.
మరి కొద్ది రోజుల్లో తిరుమల స్వామి వారి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియంను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
ఆ మ్యూజియంను భక్తులు సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు వీక్షించేందుకు త్రీడీ పిక్చర్స్ పెడుతున్నట్లు చెప్పారు. మ్యూజియంలో స్వామివారి 1296 రకాల ఆభరణాలు ఉంచనున్నట్లు చెప్పారు.
మ్యూజియం ఏర్పాటు కోసం ఓ భక్తుడు రూ.40కోట్లు విరాళంగా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్వామి వారి నగల గురించి ఇప్పటి వరకు చాలా మంది కథల రూపంలోనే, ఎవరైనా చెబితేనే విని ఉంటారు. అంతేకానీ ప్రత్యక్షంగా చూసే వీలు మాత్రం ఉండేది కాదు. అందుకే... ప్రత్యేకంగా భక్తుల కోసం ఈ ఏర్పాటు చేశారు. నిజంగా ఇది శ్రీవారి భక్తలకు శుభవార్తేనని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.