సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (10:11 IST)

భారత ఖాతాలో మరో స్వర్ణం : స్పింటర్ హిమదాస్ సత్తా

భారత ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. భారత స్టార్ స్పింటర్ హిమదాస్ అత్యుత్తమ ప్రదర్శన కారణంగా ఈ బంగారు పతకం వచ్చింది. ఫలితంగా గత 15 రోజుల్లో ఆమె స్వర్ణంతో సత్తా చాటడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 
 
ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లో టబొర్ అథ్లెటిక్ మీట్‌ జరుగుతోంది. ఈ పోటీల్లో భాగంగా, బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమ కేవలం 23 నిమిషాల 25 సెకన్లలో గెలిచింది. వీకే విస్మయ 23 నిమిషాల 43 సెకన్లలో రజతం గెలుచుకుంది. 
 
ఇకపోతే, పురుషుల విభాగం 400 మీటర్ల రేసును 45 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసిన ఇండియా స్పింటర్ మహ్మద్ అనాస్ గోల్డ్‌మెడల్ గెలవగా, సహచర స్పింటర్లు టామ్ నోహ్ నిర్మల్, కేఎస్ జీవన్, ఎంపీ జబిర్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. 
 
ఈ నెల 2వ తేదీన జరిగిన పొజన్ అథ్లెటిక్ గ్రాండ్‌ప్రీలో 200 మీటర్ల రేసును 23 నిమిషాల 65 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలిచిన హిమదాస్, 7వ తేదీన కుంటో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 97 సెకన్ల టైమింగ్‌‌తో రెండో గోల్డ్‌ను సాధించింది. 13వ తేదీన క్లాడ్నో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 43 సెకన్లలో రేస్ పూర్తిచేసి మూడో గోల్డ్‌కు దక్కించుకుంది. తాజాగా మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.