శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: గురువారం, 2 మే 2019 (12:12 IST)

01-05-2019 నుండి 31-05-2019 వరకు మీ మాస రాశిఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రథమార్ధం ఏమంత అనుకూలం కాదు. సన్నిహితులు దూరమవుతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్ళు ఎదుర్కుంటారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్ష్యంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రయాణం తలపెడతారు.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమర్థతకు గుర్తింపు ఉండదు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు అనివార్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. ప్రియతములను కలుసుకుంటారు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఖర్చులు విపరీతం. ఆదాయంపై దృష్టి పెడతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు బలపడుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పందాలకు దూరంగా ఉండాలి. 
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రత విషయం స్వయంగా తెలుసుకోవాలి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపతీరం. రాబడిపై దృష్టి పెడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. ఆత్మీయుల సలహా పాటించండి. ఏకపక్షధోరణి తగదు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వైద్య, న్యా, సాంకేతిక రంగాలవారికి ఆశాజనకరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. అధికారులకు హోదామార్పు.  
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలతలున్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాగ్ధాటితో రాణిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ధనలాభం ఉంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సందేశాలను విశ్వసించవద్దు. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు స్థానచలనం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం శుభదాయకమే. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ అతిధ్యం అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విలువైన వస్తువు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకు లాభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విదేశీయానం, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.  
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిత్రమం. వ్యవహారానుకూలత అంతగా ఉండదు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులు హితవు పాటించండి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గృహంలో స్తబ్థత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. చెల్లింపులు, నగలు స్వీకరణలో జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనకు స్పందన లభిస్తుంది. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి. 
 
ధనుర్‌రాశి: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలుసుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక సన్నిహితులకు సంతృప్తినిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి్ కలుగుతుంది. ప్రయాణంలో అవస్థలు తప్పవు. పందాలకు దూరంగా ఉండాలి.  
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం యోగదాయకమే. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సేవా సంస్థలకు విరాళిలిస్తారు. గౌరవం పెంపొందుతుంది. పరిచయాలు బలపడుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశ్చర్యకరమైన ఫలితాలెదురవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెట్టుబడి సమాచారం సేకరిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. పందాలు, జూదాలకు దూరంగా ఉండాలి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్నిరంగాలవారికి యోగదాయకమే. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు ధనం అందుతుంది. పెట్టుబడులకు అనుకూలం. గృహం సందడిగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనులు స్పురిస్తాయి. వ్యవహారానుకూలతలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు వసూలు కాగలవు. సంతానం దూకుడును అదుపు చేయండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. జూదాల జోలికి పోవద్దు.