ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (09:00 IST)

30-04-2019 మంగళవారం దినఫలాలు - కన్యరాశివారికి విరోధులు...

మేషం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. బంధువుల నుండి విమర్శలు తప్పవు. స్త్రీల పట్టుదల, మొండివైఖరి సమస్యలకు దారితీస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుకూలం.
 
వృషభం: రావలసిన బాకీలు విషయంలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవడం ఉత్తమం. కొబ్బరి, పండ్లు, పూల చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం చిన్ననాటి వ్యక్తల కలయికతో మధురానుభూతి చెందుతారు.
 
మిధునం: ఇంట్లో వృత్తి వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు ప్రయత్నించండి. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ శ్రీమతి మొండివైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. పొగడ్తలు, విమర్శలను హుందాగా స్వీకరిస్తారు. 
 
కర్కాటకం: ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. సమావేశానికి ఏర్పాట్టు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వలన ఆరోగ్యం మందగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లోనివారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. విందులో, విలాసాలలో మితంగ వ్యవహరించండి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు.
 
సింహం: రవాణా రంగాలలోని వారికి చికాకులు వంటివి ఎదుర్కుంటారు. గతంలో ఇచ్చిన సలహా మీ వలన వర్తమానంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డుచెప్పడం మంచిది కాదు. మీ కళత్రమొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. 
 
కన్య: రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. సంఘంలో మీ మాట పై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు.
 
తుల: కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. ప్రముఖల కలయిక వలన ఏమంత ప్రయోజం ఉండదు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు.
 
వృశ్చికం: పుణ్య, సేవా కార్యక్రమాల్సో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. 
 
ధనస్సు: ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. ఖర్చులు అధికం. కపటంలేని మీ ఆలోచనులు, సలహాలా మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
మకరం: బాకీలు, ఇంటి అద్దెల వసూళ్ళల్లో దుడుకుతనం కూడదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వలన అనుకోని ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆత్మ విశ్వానం రెట్టింపవుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
కుంభం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పనిభారం అధికమవుతుంది. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్య సమస్యలు వంటి చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది. 
 
మీనం: భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో మెళకువ అవసరం. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఓర్పు, అంకితభావం చాలా అవసరమని గమనించండి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో ఏమరుపాటుతనం వలన ఇబ్బందులు తప్పవు.