శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (09:40 IST)

27-04-2019 - శనివారం మీ రాశిఫలితాలు - దూరప్రయాణాలు అనుకూలిస్తాయి...

మేషం: ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అకాలోభోజనం, శ్రమాధిక్యత వలన పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. శాంతియుతంగా మీ సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
వృషభం: రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. ప్రైవేటు రంగాల్లో వారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. బాకీలు, నెలసరి వాయిదాల వసూళ్ళల్లో కలెక్షన్ ఏజెంట్లు లౌక్యంగా మెలగాలి. ప్రయాణాలు సజావుగా సాగినా లక్ష్యం నెరవేరదు.
 
మిధునం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. గృహోపకరణాల వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
కర్కాటకం: బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ, ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వ్యాపారం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. ఉద్యోగస్తుల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయమని గమనించండి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.
 
సింహం: ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడుతాయి. బంధుమిత్రుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. సినిమా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. మీ సంతానంలో వచ్చిన మార్పు మీకెంతో సంతృప్తినిస్తుంది.
 
కన్య: ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాల విషయంలో ఖచ్చితంగా మెలగాలి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మత్తులకు గురికావచ్చును. ఆలయ సందర్శనాల కోసం ధనం ఖర్చుచేస్తారు. ఐరన్, సిమెంటు, కలప, ఇనుము, ఇసుక, ఇటుక, వ్యాపారస్తులకు లాభదాయకం. దంపతులకు ఏ విషయంలోను పొత్తుకుదరదు. 
 
తుల: కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ చిరువ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. బంధువులతో స్పర్థలు తొలగి సంబంధాలు బలపడుతాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు ఒక ప్రకటనల ఆకట్టుకుంటుంది.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి అధికారులు, సహోద్యోగులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ చికాకులు, ఇబ్బందులు తాత్తాలికమేనని గమనించండి. 
 
ధనస్సు: వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రైవేటు సంస్థల్లోని మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం మంచిదికాదు. దూరప్రయాణాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. ఆదాయ వ్యయాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. ప్రింటింగ్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. మిత్రులను కలుసుకుంటారు. 
 
మకరం: మీ సోదరి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనబడుతుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
కుంభం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. నేడు చేద్దామన్న పనులు రేపటికి వాయిది వేస్తారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కుంటారు. 
 
మీనం: స్త్రీలు ఉదరం, నడుము, నరాలగం సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. సంగీత, నృత్య కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. ప్రముఖులను కలిసి బహుమతులను అందజేస్తారు. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది.