గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (08:47 IST)

ఆదివారం (28-04-2019) దినఫలాలు - ఆర్థిక విషయాల్లో ఒక్క అడుగు..

మేషం : ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమవుతుందని గమనించండి. బంధుమిత్రులతో కలిసి దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికం అవుతుంది.
 
వృషభం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లోని వారికి కలసివచ్చే కాలం.
 
మిథునం : కంప్యూటర్ రంగాల్లోని వారికి కలిసివచ్చే కాలం. ప్రయాణాల్లో విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రేమికులు అవగాహనా రాహిత్యం అనర్థాలకు దారి తీస్తుంది. కోర్టు పనులు వాయిదా పడతాయి.
 
కర్కాటకం : ఓర్పుతో వ్యవహరించటంవల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ధనం విరివిగా వ్యయం అయినా సంతృప్తి, ప్రయోజనం ఉంటాయి. దైవ కార్యక్రమాలపట్ల ధ్యాస వహిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లోని వారికి పనిలో ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి.
 
సింహం : ముఖ్యుల నుంచి అందిన ఆహ్వానాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. ఇతరులకు ధన వ్యయం, ధన సహాయం విషయంలో మెలకువ వహించండి. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసి రాగలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
కన్య : ప్రైవేటు సంస్థలు, పత్రికా రంగంలోని వారికి అధికారులతో ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు అనవసర భయాందోళనలు విడనాడి శ్రమించినా జయం పొందగలరు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ మంచితనంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు.
 
తుల : స్త్రీలు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రయోజనకరమైన విషయాలు చర్చించి సత్ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. రావలసిన ధనం అనుకోకుండా చేతికి అందుతుంది. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు శుభదాయకం.
 
వృశ్చికం : నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. పెద్దలను ప్రముఖులను కలుసుకోగలుగుతారు. మార్కెటింగ్ రంగాల వారికి, ఆడిటర్లకు పనిభారం, ఒత్తిడికి లోనవుతారు.
 
ధనస్సు : రాజకీయ రంగాలలోని వారికి ప్రత్యర్థులవల్ల సమస్యలు తప్పవు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి శ్రమాధిక్యత, పనిభారం అధికం అవుతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. నిరుద్యోగులు మిత్రుల ప్రోత్సాహంతో ఉపాధి పథకాలవైపు ఆసక్తి కనబరుస్తారు.
 
మకరం : రావలసిన ధనం అందటంతో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. బేకరీ, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. వృత్తులు, చిరు వ్యాపారులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారులతోను, కార్మికులతోనూ సమస్యలు తప్పవు.
 
కుంభం : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో మెలకువ వహించండి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారస్తులకు కలసివచ్చే కాలం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సామాన్యం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
 
మీనం : స్త్రీలకు ప్రతి విషయంలోనూ ఓర్పు, ఏకాగ్రత అవసరం. ఆడిటర్లకు, వైద్య రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇబ్బందులు తప్పవు. షేర్లు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.