బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (14:12 IST)

పాపిట మధ్యలో ఎర్రని సింధూరాన్ని ధరిస్తారు.. ఎందుకు..?

పాపిట మధ్యలో ధరించే సిందూరం పెళ్ళయిందని చెప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైదిగా భావిస్తారు. అందువలనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు. ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీశక్తి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. ఎర్రని రంగు ఆమె ప్రవేశంతో సంపదలను చేకూర్చుతుందని స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతాన్ని పరిరక్షిస్తుందని పండితులు చెప్తున్నారు. 
 
బొట్టు స్త్రీ శక్తికి నిదర్శనం స్త్రీని, ఆమె భర్తను పరిరక్షిస్తుందని విశ్వసిస్తారు. బొట్టు పెట్టుకునే చోట మూడో నేత్రం ఉంటుంది. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకచోట కేంద్రీకరించే బిందువు ఇది. ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్టశక్తులు దరిచేరకుండా ఈ బొట్టు పరిరక్షిస్తుందని విశ్వాసం.