శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (18:32 IST)

నుదుట బొట్టు పెట్టుకుంటే.. ఏంటి లాభం?

మన శరీరంలో ఏడు చక్రాలు వుంటాయని.. అందులో ఆరో చక్రమే మూడో కన్నుగా పిలుస్తారు. అంటే కనుబొమల మధ్య వున్న నుదురుభాగాన్నే అలా పిలుస్తారు. శరీరంలో కల్లా ప్రధాన నాడీకేంద్రమైన ఈ బిందువు శక్తినీ ఏకాగ్రతనీ పెంచడ

మన శరీరంలో ఏడు చక్రాలు వుంటాయని.. అందులో ఆరో చక్రమే మూడో కన్నుగా పిలుస్తారు. అంటే కనుబొమల మధ్య వున్న నుదురుభాగాన్నే అలా పిలుస్తారు. శరీరంలో కల్లా ప్రధాన నాడీకేంద్రమైన ఈ బిందువు శక్తినీ ఏకాగ్రతనీ పెంచడంతోబాటు దుష్టశక్తుల్ని దూరంగా ఉంచుతుందట. అందుకే అక్కడ కుంకుమ దిద్దితే అది నాడుల్ని ప్రేరేపిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెపుతుంటారు.
 
అందుకే మహిళలు, పురుషులు తేడా లేకుండా నుదుట సింధూరం, కుంకుమ, విభూతి ధరిస్తుండాలి. అయితే మహిళలు నుదుటన ఒకే చోట బొట్టు పెడుతుంటారు. అయితే నుదుటన ఒకే చోట కుంకుమ, స్టిక్కర్లు పెట్టడం ద్వారా చర్మ సమస్యలు తలెత్తుతాయని స్కిన్ డాక్టర్లు చెప్తున్నారు. సాధారణంగా విశాలమైన నుదురు కలిగిన మహిళలు పెద్ద బొట్టు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారట. చిన్ని నుదురు కలిగిన మహిళలు కనుబొమలకు మధ్య చిన్న బొట్టును పెట్టుకోవడం ద్వారా మరింత అందంగా కనిపిస్తారు. 
 
గుండ్రపు ముఖం కలిగిన వారు కాస్త పెద్ద బొట్టును ఎంచుకోవచ్చు. గుండ్రపు ఆకారంలో వున్న స్టిక్కర్లను వాడవచ్చు. అయితే నుదుటన ఒకేచోట బొట్టు పెడితే చర్మం తెలుపుగా మారుతుంది. కొందరికి ఇన్ఫెక్షన్లు తప్పవు. అందుకే నుదుటన మార్చి మార్చి బొట్లు పెట్టుకోవాలి. స్టిక్కర్లను ఉపయోగించకుండా నాణ్యత కలిగిన కుంకుమను నుదుట ధరిస్తే మంచి ఫలితాలు సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం చేకూరుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.