పళ్లెంలో భోజనం మన కోసం ఎదురుచూడకూడదు, ఎందుకంటే?

గురువారం, 17 జూన్ 2021 (23:42 IST)
మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి.
 
 ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకనగా దీర్ఘాయుష్షు వస్తుంది.
 
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.
 
అన్నము తింటున్నప్పుడు అన్నమును, ఆ అన్నము పెట్టువారిని తిట్టుట, దుర్భాషలాడుట చేయరాదు. ఏడుస్తూ తింటూ, గిన్నె/ ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు. దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు. ఇది చాలా దరిద్రము. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం.

అన్నీ చూడండి

Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ

ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు

రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్

మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయాడు : కేతన్ అగర్వాల్ తల్లి

అన్నీ చూడండి

ఆషాఢ గుప్త నవరాత్రి ప్రారంభం.. వారాహి దేవిని పూజిస్తే...?

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు.. జూలై 16న చారిత్రక గోల్కొండ కోటపై..?

14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం

జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?

13-07-2026 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

తర్వాతి కథనం
Show comments