మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 12 డిశెంబరు 2019 (21:20 IST)

సర్వపాపహరణం తుంబుర తీర్థం.. ఎక్కడుంది?

ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్య తీర్థాలలో ఎంతోమంది మహర్షులు స్నానమాచరించి వాటి విశిష్టతను లోకానికి చాటి చెప్పారు. తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో తుంబరతీర్థం ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది.
 
పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులకు ప్రార్థించాడట. తిరుమలలో ఈ తీర్థంలో స్నానమాచరించమని వాళ్ళు సెలవు ఇవ్వడంతో అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నారు. తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం కనుక ఈ తీర్థానికి తుంబరతీర్థం అని పేరు వచ్చిందట. ఈ కారణంగానే తిరుమల వెళ్ళిన భక్తులలో కొందరు ఈ తీర్థానికి చేరుకుని అందులో స్నానమాచరిస్తుంటారు. ఈ తీర్థాన్ని టిటిడి ఎంతో అభివృద్థి చేసింది.