తిరుమల శ్రీవారి దర్శనం ఇలా వెళ్ళి అలా వచ్చేయండి.. ఎలా?
ఒకవైపు చలి, మరోవైపు సెలవులు లేకపోవడంతో తిరుమలలో రద్దీ బాగా తగ్గింది. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు గంటన్నర వ్యవధిలోనే దర్శనం అవుతుండగా ప్రత్యేక, దివ్య దర్శనం భక్తులకు అంతే సమయం పడుతోంది. క్యూలైన్లలో నడిచి వెళ్ళేందుకు పట్టేందుకు పట్టే సమయమే దర్సన సమయం కన్నా ఎక్కువగా కనిపిస్తోంది.
తిరుమలలోని 31 కంపార్టుమెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సర్వదర్సనం క్యూలైన్లలో వెళ్ళిన భక్తులు నేరుగా స్వామివారిని దర్సించుకునే అవకాశం ఉంది. ఇలా వెళ్ళి అలా దర్సనం చేసుకొని బయటకు వచ్చేయవచ్చు. సాధారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో భక్తుల రద్దీ తిరుమలలో తక్కువగా ఉంటుంది. అదే పరిస్థితి ఈ యేడాది కూడా కనిపిస్తోంది.