1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:22 IST)

కార్తీక మాసంలో విభూతి పండ్లను దానం చేస్తే?

కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు.. హరిహరులకు అత్యంత ప్రీతికరమైనవి. అందుచేత కార్తీకమాస సోమవారం రోజున ఆయన్ని పూజించడం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుంది. అందుచేత సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసిన భక్తులు దగ్గరలోని శివలాయాలను దర్శించుకోవాలి. 
 
స్వామివారికి ఆవుపాలతో అభిషేకం, బిల్వదళాలతో అర్చన చేయాలి. కార్తీక సోమవారం నాడు ఉసిరికాయను తినకూడదనే నియమం ఉంది. కార్తీక సోమవారం రోజున 'విభూతి పండ్లు' దానంగా ఇవ్వాలి. విభూతి పండ్లను దానంగా ఇవ్వడం వలన ఆరోగ్యవృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతాయని పండితులు అంటున్నారు.