Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సర్వదర్శనం టిక్కెట్ల జారీ... రోజుకు 2 వేల టోకెన్లు.. క్యూ కట్టిన భక్తులు

Written By సెల్వి
Updated: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:04 IST)
తిరుమలలో ఐదు నెలల తర్వాత ఉచిత దర్శనాలు ప్రారంభమయ్యాయి. తాజాగా సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే బుధవారం చిత్తూరు జిల్లావాసులకే టోకెన్లను పరిమితం చేశారు.
 
అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 2 వేల టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో అఖిలాండ బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు చిత్తూరు జిల్లా భక్తులు పోటీపడుతున్నారు. 
 
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది.
 
ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఒక కౌంటర్‌లో మాత్రమే టిక్కెట్లను జారీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక భక్తులకు మాత్రమే సర్వదర్శన టిక్కెట్లను జారీ చేస్తున్నారు.

అన్నీ చూడండి

జంతర్ మంతర్ ఇక నిరసనలకు కేటాయించిన ప్రదేశం కాదు.. డీ-నోటిఫై

వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయారో అర్థం కావట్లేదు... కోమటిరెడ్డి

కాన్పూర్‌లో ఆడపడుచుతో గొడవ.. కుమార్తెను విసిరేసి.. రెండో అంతస్థు నుంచి దూకేసింది..

విశాఖపట్నంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీఐలు.. నారా లోకేష్

హైదరాబాద్ నగర వాసులను వణికిస్తున్న వైరస్...

అన్నీ చూడండి

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

తర్వాతి కథనం
Show comments