శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (19:24 IST)

Thalupulamma Talli temple: గోదావరి సహజ సౌందర్యానికి సమీపంలో..

Thalli
Thalli
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవ గ్రామంలో శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం వుంది. ఇది దారకొండ, తీగకొండ మధ్య కొండపై ఈ అమ్మవారు వెలసి వుంది. స్వయంభు వెలిసిన ఈ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. 
 
తలుపులమ్మ తల్లి, లోవా టెంపుల్ గోదావరి సహజ సౌందర్యానికి ఒక నమూనాగా వుంది. అగస్త్య ముని ఇక్కడే ఈ కొండల్లో ధ్యానం చేశాడని స్థానికులు చెబుతారు. అతను ఈ కొండలోని పండ్లను తిని, ఈ కొండలోని నీటిని తాగేవాడని, అందుకే వాటికి వరుసగా దారకొండ, తీగకొండ అని పేర్లు పెట్టాడు. 
 
దారకొండ ప్రారంభమైనప్పటి నుండి అంతరాయం లేకుండా నీటి ప్రవాహం ఉంది. ఈ గ్రామాన్ని తలుపులమ్మ లోవ అని పిలుస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే చాలా మంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించి వారి వాహనాలకు అమ్మవారి చెంతనే పూజలు చేస్తారు. 
 
ఈ అమ్మవారు రోడ్డు ప్రమాదాల నుంచి భక్తులను కాపాడుతుందని విశ్వాసం. అంతేగాకుండా కోరిన కోరికలను నెరవేరుస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.