బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 మే 2023 (12:38 IST)

స్వర్ణ దేవాలయంలో పేలుడు - ఆరు రోజుల వ్యవధిలో మూడో ఘటన - ఐదుగురి అరెస్టు

golden temple
పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌లోని ప్రసిద్ధ స్వర్ణ దేవాలయంలో మరోమారు పేలుడు సంభవించింది. బుధవారం అర్థరాత్రి ఈ పేలుడు ఘటన జరిగింది. గత ఆరు రోజుల్లో జరిగిన మూడో ఘటన ఇది కావడం గమనార్హం. ఈ భారీ పేలుడుతో స్వర్ణ దేవాలయం ప్రాంతం దద్ధరిల్లిపోయింది. శ్రీగురు రాందాస్ నివాస్ సమీపంలో అర్థరాత్రి 12 గంటల సయమంలో ఈ పేలుళ్ళు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. 
 
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ నైనిహాల్ సింగ్ స్పందిస్తూ, బుధవారం అర్థరాత్రి 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య భారీ పేలుడు శబ్ధం వినిపించింది. ఇది మరో పేలుడు ఘటన. భవనం సమీపంలో శిథిలాలను కనుగొన్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ సాగుతోంది అని చెప్పారు. అయితే, గత ఆరు రోజుల వ్యవధిలో మూడో పేలుడు ఘటన. దీంతో ఈ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంతో తెలియక స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు, ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.