సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:24 IST)

యాదాద్రిలో నిత్యకల్యాణం నిలిపివేత.. ఎందుకో తెలుసా?

yadadri
తెలంగాణ రాష్ట్రంలో మరో తిరుపతిగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం యాదాద్రి పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి శ్రీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభమవుతున్నాయి. వీటిని పురస్కరించుకుని రోజువారీగా జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు. 
 
మొక్కు కల్యాణం నిర్వహించే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉత్సవాలు పూర్తయిన తరవాత మే 5వ తేదీ నుంచి నిత్యకల్యాణం, హోమం, బ్రహ్మోత్సవాలు పునఃప్రారంభమవుతాయని వివరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ మే 2 నుంచి 4వ తేదీ వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్లు ఈవో చెప్పారు.