సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (16:43 IST)

కార్తీక మాసం చివరి ఆదివారం - యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

నవంబరు 28వ తేదీ కార్తీక మాసంలో వచ్చే చివరి ఆదివారం. దీంతో అనేక పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అలాంటి ఆలయాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ఒకటి. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. 
 
ఫలితంగా యాదాద్రి పరిపర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. పైగా, భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి కూడా నాలుగు, ఐదు గంటల సమయం పట్టింది. వీఐపీ టిక్కెట్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. 
 
మరోవైపు, చివరి ఆదివారం కావడంతో స్వామివారికి నిత్య పూజలు ఆదివారం వేకువజాము 4 గంటల నుంచే ప్రారంభించారు. దేవతామూర్తులకు పట్టువస్త్రాలు, రకరకాల పూలతో అలంకరించి అభిషేకం చేసారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయం, పరిసర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.