శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జనవరి 2025 (20:26 IST)

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

tirumala temple
తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తుల్లో కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత పులి సంచారాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పర్వదినాలు, ఇతర విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 2వ తేదీన వసంత పంచమితో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 26వ తేదీన మహా శివరాత్రితో ముగుస్తాయి. 
 
ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. 5వ తేదీన- భీష్మాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. 
 
6న మధ్వ నవమి, 8న భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష ఉత్సవాలను జరుపుతారు. 12న శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, అదే రోజున మాఘ పూర్ణిమ వేడుకలను చేపడతారు. 24వ తేదీన సర్వ ఏకాదశి, 26న మహాశివరాత్రి పండగను కన్నులపండుగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని ముందుగానే అంచన వేయాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.