సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (10:40 IST)

శ్రీవారికి నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు..

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారికి ప్రతి నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు.. కౌసల్యా సుప్రజా రామ సంధ్య ప్రవర్తితే.....అంటు స్వామి వారికి మేల్కోలుపు ప్రారంభమవుతుంది.కాని ప్రతి సంవత్సరం నెల రోజులు పాటు స్వామి వారికి సుప్రభాతంకు బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కోపు ప్రారంభమవుతుంది. 
 
ధనుర్మాసం నెలలో శ్రీవారికి సుప్రభాతంకు బదులుగా గోదాదేవి రచించిన పాసురాలుతో స్వామివారికి మేల్కోలుపు జరుగుతుంది. శ్రీవారిని తన భర్తగా బావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాశురాలనే గోదాదేవి పాశురాలు అంటారు. వీటిని ధనుర్మస నెలలో ప్రతి రోజు ఒక్కో పాశురాని, సుప్రభాతంకు బదులుగా పఠిస్తు స్వామి వారిని మేల్కోపుతారు అర్చకులు. 
 
ఇక ఈ నెల రోజుల పాటు స్వామి వారికి నిర్వహించే సహస్రనామర్చనలో నిత్యం ఉపయోగించే తులసిదళాలుకు బదులుగా బిల్వాపత్రాలతో నిర్వహిస్తారు.మరో వైపు స్వామి వారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు.ఇలా నెల రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు స్వామి వారికి నిర్వహిస్తారు.
 
పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికి శ్రీవారి బ్రహ్మోత్సవాల సంధర్భముగా ఐదోవ రోజు జరిగే మోహిని అవతారం సంధర్భముగా శ్రీవల్లి పుత్తురు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు,చిలుకతో పాటు,గరుడ సేవలో అలంకరించేందుకు తులసి మాలలు స్వామి వారికి సమర్పిస్తారు.ఇక ధనుర్మాస నెలలో నెలరోజులు పాటు గోదాదేవి వ్రాసిన పాశురాలను పఠించడం ఆనాది కాలంగా వస్తున్న సంప్రదాయం. 
 
తిరిగి జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునఃరుద్దరిస్తారు.దేవతులుకు 6 నెలలు కాలం పగలుగా మరో 6 నెలలు కాలం రాత్రిగా పరిగణిస్తారు.ఇక ధనుర్మాసం నెల దేవతులుకు బ్రహ్మ మూహుర్తంగా పరిగణింపబడుతుంది.ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రశాంతంగా వుంటారని....ఆ వేళలో భక్తులు దేవతలును పూజిస్తే సులభంగా ప్రశన్నమవుతారని భక్తులు విశ్వాసం. 
 
మరోవైపు శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం నెలలో వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తారు. ఏడాదికి రోండు రోజులు పాటు తెరిచి వుంచే వైకుంఠ ద్వారా దర్శనం భక్తులుకు లభించేది ధనుర్మాసం నెలలోనే.ఇలా ధనుర్మాసంకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకత వుండడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.