1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 7 నవంబరు 2022 (10:44 IST)

8న చంద్రగ్రహణం - శ్రీవారి ఆలయం మూసివేత

ttd temple
ఈ నెల 8వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కనిపించనుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంను మూసివేయనున్నారు. మొత్తం 11 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. 8వ తేదీ ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజల తర్వాత శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. 
 
కాగా, చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటలకు నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 
 
చంద్రగ్రహణం నేపథ్యంలో 7న సిఫారసు లేఖలు స్వీకరించబోడవం లేదని తితిదే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తేదీన గ్రహణం రోజున సర్వదర్శనం టోకెన్లను కూడా జారీ చేయడం లేదని చెప్పారు. బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు పేర్కొంది.