Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం: క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి వుండాల్సిన పనిలేదు..

Written By సెల్వి
Updated: సోమవారం, 7 నవంబరు 2022 (10:09 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు మళ్లీ టైమ్ అలాట్‌మెంట్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఈ టిక్కెట్లు తిరుపతి బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గోవిందరాజ్ సత్రం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రోజూ 20వేల టిక్కెట్లు జారీ చేస్తారు. 
 
ఈ టికెట్ ఉన్న భక్తులు నిర్దేశిత సమయాల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ సమాచారం తెలియని భక్తులు తిరుమలకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. శని, ఆది సెలవులు కావడంతో భక్తులు సాధారణం కంటే ఎక్కువగా తరలివచ్చారు. 
 
రూ.300 టిక్కెట్లు ఉన్న భక్తులు గంటన్నరలో దర్శనం చేసుకుంటున్నారు. కాగా, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితిని నివారించేందుకు వీలుగా సమయపాలన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి విలేకరులకు తెలిపారు.

అన్నీ చూడండి

లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్... బెంగుళూరు రెస్టారెంట్‌ బిల్లులో బాడీ షేమింగ్

వేల అడుగుల ఎత్తులో విమానం - టిక్కెట్టు లేని రహస్య ప్రయాణికుడు

వందేమాతరం ఆలపించడం ఇష్టంలేకుంటే బెంగాల్ విడిచి వెళ్లండి : సీఎం సువేందు హెచ్చరిక

అమెరికా భూభాగంలో హర్మూజ్ జలసంధి : డోనాల్డ్ ట్రంప్

దేశంలో 8.7 కోట్ల మంది తిని తిరుగుతున్నారు...

అన్నీ చూడండి

23-08-2026 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు-అనుకూలతలు అంతంత మాత్రమే

22-08-2026 శనివారం నాటి మీ రాశి ఫలితాలు - బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు

ఇంద్రకీలాద్రి కొండపై భోజనశాల.. లడ్డూ పోటు భవనాలు

21-08-2026 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు - అనవసర విషయాలకు దూరంగా ఉండండి

Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారా? బ్రహ్మముహూర్తంలో..?

తర్వాతి కథనం
Show comments