శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (13:17 IST)

జమ్మూకాశ్మీర్‌లో శ్రీవారి ఆలయం... వారణాసి, ముంబైలోనూ..? (video)

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కొంగు బంగారం. అందుకే ఆయనను  భక్తులు ఏడు కొండలెక్కి దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి శ్రీవారిని కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటూ వుంటారు. అయితే శ్రీవారి దర్శనం కోసం వెంకటాద్రికి వస్తున్న ఉత్తరాది భక్తులకు ఒక మంచి సదుపాయం కల్పించనుంది టీటీడీ.
 
జమ్మూ కాశ్మీర్, ముంబై, వారణాసిల్లో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చురుకుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక కోసం టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ శుక్రవారం ఆ రాష్ట్రానికి ప్రయాణామవుతున్నారు. 
 
కాగా, కాశ్మీర్‌తో పాటు వారణాసి, ముంబైలలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ డిసెంబరులో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ఇప్పటికే రెండు స్థలాలను గుర్తించింది. దీంతో ఈవో ఆ రాష్ట్రానికి వెళ్లి ఈ రెండు స్థలాలను పరిశీలించాక తమకు అనుకూలమైన ప్రాంతంలో టీటీడీ ఆలయం నిర్మించే అవకాశం ఉంది. ఫలితంగా జమ్మూకాశ్మీర్ ప్రజలకు తమ రాష్ట్రంలోనే శ్రీవారిని దర్శించుకునే సౌలభ్యం త్వరలోనే లభించనుంది.