బుధవారం, 27 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (14:03 IST)

నీరజ్ చోప్రాకు ఆ ప్రశ్న.. నీ సెక్స్‌జీవితాన్ని, అథ్లెటిక్స్‌ ట్రైనింగ్‌ను..? (Video)

ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌ 2020లో జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భారత దేశంలో అతడో పెద్ద స్టార్‌ అయ్యాడు. యువతకు ఆదర్శప్రాయంగా మారాడు. ఆధునిక ఒలింపిక్స్‌ చరిత్రలో ఇప్పటి వరకు అథ్లెటిక్స్‌లో ఒక్క పతకం కూడా సాధించని భారత్‌.. నీరజ్ చోప్రా పుణ్యమాని చరిత్రను తిరగరాసింది. 
 
నీరజ్‌ బరిసెను అల్లంత దూరానికి విసరి.. విశ్వ వేదికపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించాడు. ఫైనల్ పోరులో బరిసెను 87.58 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో అతడిని ఇంటర్వ్యూల పేరుతో ఇబ్బందికర ప్రశ్నలు అడగటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.
 
ఇటీవల ఒక ఆంగ్ల మీడియా నీరజ్‌ చోప్రాను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఆయన వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలు కొందరు అడిగారు. ఈ క్రమంలో చరిత్రకారుడు రాజీవ్‌ సేథీ లైన్‌లోకి వచ్చారు. 'అందమైన కుర్రాడివి. నీ సెక్స్‌జీవితాన్ని, అథ్లెటిక్స్‌ ట్రైనింగ్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేసుకొంటున్నావు?' అని ప్రశ్నించారు.
 
ఇదొక ఇబ్బందికరమైన ప్రశ్నే అయినా.. అథ్లెటిక్స్‌కు ఇది సీరియస్‌ ప్రశ్నే అని పేర్కొన్నారు. దీనికి నీరజ్‌ చోప్రా చాలా హుందాగా స్పందించారు. 'సారీ సర్‌' అని సమాధానం ఇచ్చాడు. అయినా సరే రాజీవ్‌ సేథీ వదిలిపెట్టలేదు. మరోసారి అదే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని కోరారు. 
 
ఈసారి కూడా నీరజ్‌ సహనం కోల్పోకుండా 'ప్లీజ్‌ సర్‌, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయింది' జవాబిచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. నీరజ్‌ చోప్రాకు ప్ర‌శ్న వేసిన రాజీవ్ సేథి వైఖ‌రిని చాలా మంది ప్ర‌ముఖులు ఖండించారు.