శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (08:48 IST)

నువ్వేమైనా మూర్ఖుడివా? అంపైర్‌ను ఏకి పారేసిన మెద్వెదెవ్

Medvedev
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వదెవ్ దూసుకెళ్లాడు. కానీ ఛైర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనికి కారణం సెమీఫైనల్లో మెద్వెదెవ్ ఓడించిన గ్రీకు ఆటగాడు స్టెఫానో సిట్సిపాసే. విరామం సమయంలో మెద్వదెవ్.. అంపైర్‌తో వాగ్వివాదానికి దిగాడు
 
ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్‌కు గ్యాలరీలోంచి అతడి తండ్రి సలహాలు ఇస్తున్నాడని మెద్వెదెవ్ ఆరోపించాడు. "నీకది కనిపించడంలేదా? నువ్వేమైనా మూర్ఖుడివా?" అంటూ తిట్లపురాణం లంకించుకున్నాడు. ఆ అంపైర్ మెద్వెదెవ్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
 
అయితే ఈ రష్యన్ ఆటగాడు శాంతించలేదు. కోర్టులో ఆడుతున్న ఆటగాడికి కోచ్ కాకుండా మరో వ్యక్తి ఎలా సలహాలు ఇస్తాడని ప్రశ్నించాడు. ఓ ఆటగాడికి ఇద్దరి నుంచి సలహాలు అందడం సరైనదేనా? అని నిలదీశాడు. 
 
అందుకు అంపైర్ బదులివ్వకపోవడంతో "నువ్వు పెద్ద దుర్మార్గుడిలా ఉన్నావ్" అంటూ మెద్వెదెవ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్ స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు.