శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 జనవరి 2022 (11:30 IST)

బ్యాడ్మింటన్ స్టార్లకు కరోనావైరస్...

ఈసారి కరోనావైరస్ సెలబ్రిటీలు, క్రీడాకారులపై పంజా విసిరినట్లు కనబడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ స్టార్లను కరోనా వైరస్ పట్టుకుంది. అలాగే క్రీడాకారులకు కూడా కరోనా సోకింది.

 
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ బి.సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇతడితో పాటు ధృవ్ రావత్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీనితో వీళ్లిద్దరూ ప్రస్తుతం టోర్నీకి దూరమయ్యారు.

 
అంతేకాదు.. ఇంగ్లండ్ డబుల్స్ స్పెషలిస్ట్ సీన్ వెండీ, కోచ్ నాథన్ కూడా కోరనా బారిన పడ్డారు. ఇలా క్రీడాకారులను కరోనావైరస్ వెంటాడుతోంది.