శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (14:17 IST)

టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడతాయా?

Tokyo olympics
జపాన్‌లో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌... షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు లేవనీ, తమ అథ్లెట్లు 2021లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రిపేర్ అవుతారని ఆస్ట్రేలియా ఒలింపిక్స్ అధికారులు ప్రకటించారు. దీనిపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు. కానీ... వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
షెడ్యూల్ ప్రకారమైతే టోక్యో ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ జపాన్‌తో పాటూ 192 దేశాల్లో విస్తరించింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్లు ఉన్నాయి. విమాన సర్వీసులు సరిగా లేవు. అందుకే ఈ క్రీడలు ప్రస్తుత షెడ్యూల్‌లో నిర్వహించడం కుదరదని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా క్రీడలు రద్దైనందున ఒలింపిక్స్ కూడా అదే రూట్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. 
 
ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలు ఇప్పటికే రద్దయ్యాయి. అథ్లెట్ల ట్రైనింగ్ కూడా సాగట్లేదు. చాలా దేశాలు వాయిదా వెయ్యమని కోరుతున్నాయి. ఒలింపిక్స్‌ రద్దయితే..రూ. 21,500 కోట్ల స్వదేశీ స్పాన్సర్‌షిప్‌, ఏర్పాట్లపై ఖర్చుపెట్టిన రూ.90 వేల కోట్లు నష్టపోతామని జపాన్‌ ప్రధాని షింజో అబే అంటున్నారు.