ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (21:43 IST)

క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానా రోనాల్డోను కరోనా వైరస్ కాటేసింది. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ క్రమంలో బుధవారం స్వీడెన్ జట్టుతో జరగాల్సిన నేషనల్ లీగ్ మ్యాచ్‌లో రోనాల్డో పాల్గొనడం లేదని పేర్కొంది. 35 యేళ్ల ఈ పోర్చుగీస్ క్రీడాకారుడు... ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక భూమికను పోషించాడు. 
 
కాగా, పోర్చుగీస్ జట్టులో ఒక్క రోనాల్డోకు మాత్రమే కరోనా వైరస్ సోకిందనీ, మిగిలిన ఆటగాళ్లంతా క్షేమంగా ఉన్నట్టు పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా, ఇప్పటివరకు 101 గోల్స్ వేసిన రొనాల్డో బుధవారం నాటి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోవడం పోర్చుగీస్ జట్టుకు పెద్ద లోటుగా చెప్పొచ్చు.