శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (17:49 IST)

ఫిఫా వరల్డ్ కప్: ఒక రోజు ముందుగానే ప్రారంభం..

fifa world cup
ఫిఫా వరల్డ్ కప్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ తేదీ ఖరారు కాగానే టోర్నీ జరిగే దేశానికి వెళ్లేందుకు అభిమానులు ప్లాన్ చేసుకుంటారు. ఈ ఏడాది ఖతార్ వేదికగా జరగాల్సిన ఫిఫా వరల్డ్ కప్ ఒక రోజు ముందే మొదలవనుంది. 
 
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21న ఈ టోర్నీ మొదలవ్వాలి. కానీ, నవంబర్ 20వ తేదీనే ప్రారంభిస్తున్నట్టు ఫిఫా గురువారం అధికారికంగా ప్రకటించింది. 
 
ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పు రావడం చాలా అరుదు. పాత షెడ్యూల్‌లో భాగంగా నవంబర్ 21న ఈక్వెడార్‌తో ఖతార్ అధికారిక ప్రారంభ మ్యాచ్‌ ఉండాల్సి ఉంది. 
 
కొత్త షెడ్యూల్ ప్రకారం ఆ రోజు సెనెగల్‌తో నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈక్వెడార్‌తో ఖతార్ తొలి మ్యాచ్‌ను నవంబర్ 20వ తేదీకి మార్చారు. మారిన తేదీలకు తగ్గట్టు ఖతార్ రావాలనుకుంటున్న సాకర్ అభిమానులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది.