గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (22:26 IST)

ఫిఫా ప్రపంచ సాకర్ కప్ : జర్మనీకి షాకిచ్చిన జపాన్

japan soccer team
గల్భ్ దేశాల్లో ఒకటైన ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచ సాకర్ కప్ ఫుట్‌బాల్ పోటీలు సాగుతున్నాయి. ఈ పోటీల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. మంగళవారం జరిగిన పోటీలో అర్జెంటీనా జట్టును సౌదీ అరేబియా ఖంగుతినిపించింది. గురువారం జర్మనీకి జపాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో జర్మనీని 2-1 తేడాతో జపాన్ ఓడించింది.
 
ఈ మ్యాచ్ తొలి అర్థభాగం ముగిసే సమయానికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత జపాన్ ఆటగాళ్లు విజృంభించి స్వల్ప వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించారు. ఆ తర్వాత జర్మనీని జాగ్రతగా అడ్డుకుంటూ జపాన్ ఆటగాళ్లు నిలువరించారు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి జపాన్ 2-1 తేడాతో  విజయభేరీ మోగించి, సంచలనం నమోదు చేసింది. 
 
మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్‌షిప్ ఫ్రాన్స్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. ఫ్రాన్స్ ఆటగాళ్లు దూకుడు ముందు నిలువలేక పోయారు. ఆస్ట్రేలియా వరుస గోల్స్ సమర్పించుకుని ఓటమి పాలైంది. మొరాకో - క్రోయేషియా మధ్య జరిగిన మరో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.