ఆదివారం, 24 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (17:47 IST)

టోక్యో ఒలింపిక్స్‌: సెమీస్‌లో ఓడిన భారత మహిళల హాకీ జట్టు

Hockey
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టుకు ఇబ్బందులు తప్పట్లేదు. రాణి రాంపాల్‌ సేన చివరి వరకూ గెలుపు కోసం పోరాడినా ఓటమి తప్పలేదు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టు అర్జెంటీనాతో బుధవారం తలపడి 2-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో తొలిసారిగా ఫైనల్‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఇక కాంస్య పకతం కోసం జరిగే పోరులో తలపడనుంది. 
 
కీలకమైన సెమీస్‌లో భారత మహిళల హాకీ జట్టు ఆఖరి నిమిషం వరకు విజయం కోసం ప్రయత్నించినా.. ప్రత్యర్థి జట్టు తమ అనుభవంతో ఆ ప్రయత్నాలను అడ్డుకొంది. భారత్‌ నుంచి గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేయగా.. అర్జెంటీనాలో మరియా నోయెల్‌ 2 గోల్స్‌ చేసింది. 
 
ఇక కాంస్యం కోసం భారత్‌ బ్రిటన్‌తో తలపడనుంది. బ్రిటన్‌ జట్టు మొదటి సెమీ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో 5-1 తేడాతో ఓడిపోయింది. కాంస్యం కోసం నెదర్లాండ్స్‌, అర్జెంటీనా తలపడనున్నాయి. భారత పురుషుల హాకీ జట్టు కూడా సెమీఫైనల్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే.