శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (11:28 IST)

కామన్వెల్త్ క్రీడల్లో పసిడిన పతకం సాధించిన నిఖత్ జరీన్

Nikhat Zareen
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడిని సాధించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. 
 
50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్ ఇవాళ జరిగిన ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్ కు చెందిన కార్లీ మెక్ నాల్ పై విజయం సాధించింది. ఈ బౌట్ లో జడ్జిలు 5-0తో నిఖత్ కే ఓటేశారు. 
 
కాగా, నిఖత్ సాధించిన స్వర్ణంతో భారత్ కామన్వెల్త్ క్రీడల పతకాల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు సహా మొత్తం 48 పతకాలు ఉన్నాయి.