ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (13:53 IST)

రఫెల్ నాదల్ రికార్డును బ్రేక్ చేసిన నోవాక్‌ జకోవిచ్‌

Novak Djokovic
ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్‌ లెజెండ్, మాజీ నెంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ రికార్డు సృష్టించాడు. 17వ సారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ 16సార్లు క్వార్టర్ ఫైనల్స్ చేరిన రికార్డును జొకో బ్రేక్‌ చేశాడు. 
 
ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్‌ జకోవిచ్‌ 6-3, 6-2, 6-2తో పెరూ ఆటగాడు యువాన్‌ పాబ్లో (పెరూ)పై గెలిచాడు. దాంతో, క్వార్టర్ ఫైనల్ చేరి పురుషుల సింగిల్స్‌‌లో అత్యధికంగా 23 గ్రాండ్ స్లామ్స్‌ అందుకునేందుకు మరింత చేరువయ్యాడు. 
 
ప్రస్తుతం నొవాక్, నాదల్  చెరో 22 గ్రాండ్‌స్లామ్స్‌తో సమంగా ఉన్నారు. గాయం కారణంగా నాదల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.