ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (16:30 IST)

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు కాంస్యం

Shooter Swapnil Kusale
Shooter Swapnil Kusale
భారత షూటర్ స్వప్నిల్ కుసాలే తొలిసారిగా ఒలింపిక్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్యం గెలవడం ద్వారా గురువారం జరుగుతున్న పారిస్ గేమ్స్‌లో దేశం మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకుంది. 
 
ఎనిమిది షూటర్ల ఫైనల్‌లో కుసాలే 451.4 పాయింట్లతో విజయం సాధించాడు. ఇక 28 ఏళ్ల మను భాకర్ అద్భుత ప్రదర్శన కారణంగా భారత్‌కు తొలి పతకం వచ్చింది.
 
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యంతో పాటు సరబ్జోత్ సింగ్ రాణించారు. భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన మూడు పతకాలు షూటింగ్ ఈవెంట్‌లలో వచ్చినవే.