సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జులై 2024 (11:18 IST)

పారిస్ ఒలింపిక్స్ ఆడమంటే.. ప్రియుడితో కలిసి జల్సా చేస్తావా?

Brazil swimmer
Brazil swimmer
పారిస్ ఒలింపిక్స్‌లో ధీటుగా ఆడేందుకు బరిలోకి దిగాల్సిన బ్రెజిల్ స్విమ్మర్ కరోలినా వేటుకు గురైంది. ఇందుకు కారణం.. ఆమె నిర్లక్ష్యమే. ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టేందుకు అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. 
 
కానీ ఆమె ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. తన ప్రియుడైన మరో అథ్లెట్ అయిన గాబ్రియేల్ శాంటోస్‌తో కలిసి పారిస్ అంతా విహరించి టోర్నీ సమయానికి తిరిగివచ్చారు. 
 
దీంతో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ ఆమెను స్వదేశానికి పంపించింది. సారీ చెప్పిన శాంటోస్‌కు ఆడే ఛాన్స్ ఇచ్చినప్పటికీ.. ఆతడు పారిస్ ఒలింపిక్స్‌లో ధీటుగా ఆడలేక ఓటమిని చవిచూశాడు.