సూపర్ లీగ్ కేరళ జట్టు కొచ్చి పైపర్స్‌లో పృథ్వీరాజ్ వాటా
మలయాళ సినిమా సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన భార్య సుప్రియ సూపర్ లీగ్ కేరళ (SLK)లో ఫుట్‌బాల్ జట్టు అయిన కొచ్చి పైపర్స్ ఎఫ్‌సిలో వాటాలను కొనుగోలు చేశారు. లీగ్‌లో పోటీపడుతున్న ఆరు జట్లలో కొచ్చి పైపర్స్ FC ఒకటి.
దీని ప్రారంభ ఎడిషన్ ఈ సంవత్సరం ఆగస్టు చివరిలో ప్రారంభమవుతుంది. టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి , అతని నటి భార్య లారా దత్తా ఈ క్లబ్ ఇతర యజమానులు. కొచ్చి పైపర్స్ ఎఫ్‌సిని కొనుగోలు చేయడం ద్వారా, వర్ధమాన ఫుట్‌బాల్ ప్రతిభకు ఒక వేదికను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పృథ్వీ దంపతులు తెలిపారు.
కాగా ఏప్రిల్ 25, 2011న పృథ్వీరాజ్ జర్నలిస్టు సుప్రియను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2014లో ఓ పాపకు జన్మనిచ్చారు. పృథ్వీరాజ్ - సుప్రియల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.