గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (12:00 IST)

ఒలింపిక్స్‌లో ధరించే న్యూ జెర్సీతో సానియా స్టెప్పెలు.. వీడియో వైరల్

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జపాన్ రాజధాని టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొననుంది. ఇందులో టెన్నిస్ డ‌బుల్స్ విభాగంలో ఆమె ఆడుతారు. ఈవెంట్‌లో మెడ‌ల్‌పై సోనియాపై భారీ ఆశలే పెట్టుకునివున్నారు. 
 
ఈ నేపథ్యంలో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఒలింపిక్స్‌లో ధ‌రించ‌బోయే జెర్సీ వేసుకొని సానియా డ్యాన్స్ చేయ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. అమెరిక‌న్ ర్యాప‌ర్ డోజా క్యాట్ లేటెస్ట్ హిట్ కిస్ మి మోర్ సాంగ్‌పై ఆమె డ్యాన్స్ చేసింది. 
 
త‌న పేరులోని ఎ అక్షరానికి త‌న జీవితంలో ఎంతో ప్రాధాన్య‌త ఉంద‌ని ఆమె చెప్పింది. ఎ అంటే అగ్రెష‌న్‌, ఆంబిష‌న్‌, అచీవ్‌, అఫెక్ష‌న్ అని సానియా వివ‌రించింది. ఈ పోస్ట్ చేసిన గంట‌ల్లోనే ల‌క్ష‌కుపైగా లైక్స్ రావ‌డం విశేషం.
 
గ‌త నెల‌లోనే ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ఇండియ‌న్ టీమ్ కిట్‌ను లాంచ్ చేసింది. ఈ కిట్‌తోనే మంగ‌ళ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోనూ, మిగ‌తా అథ్లెట్ల‌తో క‌లిసి సానియా మాట్లాడింది. 
 
ఈ సంద‌ర్భంగా భార‌త టెన్నిస్‌కు సానియా చేసిన సేవ‌ల‌ను మోడీ కొనియాడారు. ఈ మ‌ధ్య జ‌రిగిన‌ వింబుల్డ‌న్‌లో సానియా ఆడిన విష‌యం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె అంకితా రానాతో క‌లిసి డ‌బుల్స్ బ‌రిలో దిగ‌నుంది.