గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (11:07 IST)

పెళ్లికాకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్!

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పెళ్లికాకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్‌లోని ఓ మెడికల్ సెంటర్‌లో సెరెనా శుక్రవారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆమె కుటుంబసభ్

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పెళ్లికాకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్‌లోని ఓ మెడికల్ సెంటర్‌లో సెరెనా శుక్రవారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. పుట్టిన చిన్నారి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. 
 
గత కొన్ని నెలలుగా ప్రియుడు అలెక్సిస్ ఒహ‌నియ‌న్‌తో కలిసి సెరెనా సహజీవనం చేస్తున్న విషయం తెల్సిందే. ప్రసవం తర్వాత బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో సోషల్‌ మీడియాలో సెరెనాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
 
కాగా, గత ఏప్రిల్‌ నెలలో తాను 20 వారాల గర్భవతినన్న విషయం స్నాప్‌ఛాట్‌ ద్వారా ప్రకటించింది. బిడ్డ పుట్టాకే తన ప్రియుడు అలెక్సిస్‌ పెళ్లి చేసుకోవాలని కూడా ప్రకటించింది. మరి ఇప్పుడు ఈ ఇద్దరికి పండంటి పాప పుట్టింది కాబట్టి, త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ వార్తతో సెరెనాకు అభినందనలు వెల్లువెత్తాయి. సెరెనాను అభినందిస్తూ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఓ ట్వీట్ చేయగా, హాలీవుడ్ సింగర్ బేవొన్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సెరెనా గర్భవతిగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసి అభినందించింది.