ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (20:50 IST)

హాయ్.. గైస్... మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా వుంది.. ఆటగాళ్లతో ఫీల్డ్ అంపైర్ (Video)

జోహాన్నెస్‌బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజైన గురువారం వరుణ దేవుడు తీవ్ర అటంకం కలిగించారు. ఫలితంగా ఒక్క బంతి కూడా పడలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైరింగ్ విధులు నిర్వహించే సౌతాఫ్రికా జాతీయుడు మరాయిస్ ఎరాస్మస్ ఓ దశలో భారత ఆటగాళ్ల అరుపులకు బెంబేలెత్తిపోయారు. 
 
బంతి ప్యాడ్లకు తగిలితే చాలు.. బౌలర్, వికెట్ కీపర్ సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్క భారత క్రికెటర్ బిగ్గరగా అరుస్తూ అప్పీల్ చేయడం పట్ల ఆయన స్పందించారు. ప్రధానంగా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు తరచుగా అప్పీల్ చేయడం అంపైర్ మారాయిస్ ఎరాస్మస్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది. దీంతో ఆయన భారత ఆటగాళ్లను ఉద్దేశించి.. "మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా వుంది" అని మెల్లగా అన్నారు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీనికి సబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.