1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మే 2024 (22:20 IST)

భర్త తాగొచ్చాడని గొడ్డలితో నరికేసింది.. చివరికి ఏమైందంటే?

crime
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ముమ్మాయిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నక్క నాగయ్య (48), అతని భార్య లక్ష్మి దంపతులకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. 
 
ఈ క్రమంలో సోమవారం లక్ష్మి భర్త నాగయ్య మద్యం మత్తులో గొడవ పడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన లక్ష్మి పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకుని నాగయ్యపై దాడి చేసింది. గ్రామస్తులు వెంటనే 108 సహాయంతో నాగయ్యను జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
భార్య లక్ష్మిని బిజినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.