శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 మార్చి 2024 (19:45 IST)

అనుమానంతో 6 నెలల గర్భవతి అయిన భార్యను గొంతు కోసి హత్య

crime
అతడికి అనుమానం పెనుభూతమైంది. ఆరు నెలల గర్భవతి అయిన భార్యను అత్యంత పాశవికంగా గొంతుకోసి హత్య చేసాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివశంకర్ అనే వ్యక్తి తుర్కదిన్నె గ్రామ నివాసి. అతడి భార్య బాలేశ్వరమ్మ గర్భవతి అయ్యింది. ఆరో నెల రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది. ఐతే ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో భర్త ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేసాడు. అనంతరం అతడు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.