శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (20:39 IST)

ఉద్యోగాలు ఇప్పిస్తామని బోర్డ్ తిప్పేసింది.. మాదాపూర్‌లో మోసం

Fraud
ఉద్యోగాలు ఇప్పిస్తామని.. శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ ఇప్పించినట్లు నమ్మించి జీతాలు ఇవ్వడం మానేశిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ద్వారా మోసపోయిన బాధితులను పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. 
 
ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. ఆపై జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ కంపెనీకి విజయవాడ, బెంగళూరులో బ్రాంచ్‌లు వున్నాయని తెలిసింది. మోసం చేశామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.