శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2024 (19:01 IST)

ఒరేయ్ అల్లుళ్లూ, మీ మావయ్యతో వేగలేకపోతున్నా, అతణ్ణి చంపేయండి

crime
కొందరు భర్తలు ప్రతి చిన్న విషయానికి భార్యలను వేధిస్తుంటారు. ఆ గొడవలు ఎలా వుంటాయంటే... నవ్వుతున్నావేంటి, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, వాళ్లను ఎందుకు చూస్తున్నావు, ఫలానా వ్యక్తి నిన్నే ఎందుకు చూస్తున్నాడు... వంటి వేధింపులు చాలానే వుంటాయి. ఐతే వీటిని కొందరు భరిస్తుంటారు కానీ మరికొందరు ఆ వేధింపులను తాళలేక క్రూరంగా మారిపోతుంటారు. అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 45 ఏళ్ల మస్నాజీ నిత్యం తన భార్యను ఏదో వంకతో వేధిస్తుండేవాడు. చీటికిమాటికి గొడవపడుతూ దండిస్తుండేవాడు. ఈ బాధ భరించలేని బాధితురాలు తన ఇద్దరు మేనళ్లులకు మొరపెట్టుకున్నది. మావయ్య వేధింపులను భరించలేకపోతున్నాననీ, అతడి అడ్డు తొలగించండి అని చెప్పడంతో వారిరువురూ మరో వ్యక్తిని తోడు తీసుకుని మస్నాజీపై దాడి చేసారు. ఇనుప రాడ్లు, కర్రలతో బలంగా మోదడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.