కారులో షాట్ సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శామీర్ పేట వద్ద వేగంగా వెళుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఈ విషాద ఘట స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఓ కారు శామీర్‌పేట్ నుంచి ఘట్‌కేసర్ వైపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో కారులో సాంకేతికలోపం తలెత్తి షార్ట్ సర్య్కూట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అగ్నికీలల్లో కారు పూర్తిగా కాలిపోయింది.
ఈ మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ కూడా తన సీటులోనే సజీవదహనమయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.