శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (08:53 IST)

'రేవంత్ అన్నా మీతో మాట్లాడాలి'... మహిళ పిలుపునకు స్పందించిన సీఎం...

revanth - woman
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఆయన ప్రజాక్షేత్రంలో దిగిపోయారు. ప్రజల సమస్య పరిష్కారానికి నడుంబిగించారు. ఆదివారం ఓ సామాన్య మహిళ పిలుపునకు కూడా ఆయన స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మహిళ పిలుపును విన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సామాన్య వ్యక్తిలా ఆ మహిళ ఉండే వద్దకు వెళ్లి ఆమె సమస్యను ఆలకించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించి వెళుతుండగా... ఆస్పత్రి లాబీలోనుంచి ఓ మహిళ "రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి" అంటూ బిగ్గరా అభ్యర్థించారు. ఆ పిలుపువిన్న సీఎం రేవంత్.. ఆమె వద్దకు వెళ్లి సమస్య ఏంటో చెప్పాలని అడిగారు. తన పాపకు ఆస్పత్రి సంబంధించిన ఖర్చు చాలా అవుతుందని, సాయం చేయాలని కోరారు. వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.