గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మే 2024 (20:19 IST)

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

murder
బోరబండ వద్ద మంగళవారం రాత్రి మేకప్ ఆర్టిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సినీ ఇండస్ట్రీలో పనిచేసే బోరబండ వెంకటగిరి ప్రాంతానికి చెందిన చుక్క చెన్నయ్య (30) ఏదో పని మీద బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం బోరబండ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో చెన్నయ్య మృతదేహం లభ్యమైంది.
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పదునైన ఆయుధాలతో చెన్నయ్యను పొడిచి చంపిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు పరిసరాల్లో అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.