శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (14:22 IST)

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

brs flag
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న జరగనున్న ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఎన్‌ నవీన్‌కుమార్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. 

ఉపఎన్నికలకు నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ మార్చి 11. పోలింగ్ మార్చి 28న నిర్వహించి, ఓట్ల లెక్కింపు, ఏప్రిల్ 2న ఫలితాలను ప్రకటించనున్నారు. 
 
బీఆర్‌ఎస్‌కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయింది.