బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (20:46 IST)

మేడారం జాతర : నిలువెత్తు బంగారం మొక్కుబడి.. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు..

Medaram Jatara
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలను ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును ఆలయ అధికారులు కల్పించారు. ఈ సౌకర్యాన్ని మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు.
 
మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ప్రభుత్వం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించే వెసులుబాటు కల్పించింది. నిలువెత్తు బంగారం మొక్కుబడి కోసం రూ.60 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే మేడారం ప్రసాదాన్ని పోస్టు ద్వారా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. 
 
కాగా, మేడారం జాతర బుధవారం ప్రారంభమైంది. జాతర మొదటి దశ గుడిమెలిగె పండుగతో ప్రారంభమైంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలగె తంతు నిర్వహిస్తారు. గుడిమెలిగెలో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఉత్సవాలు ఈ నెల 21న ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి.